తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీ గురు తేజ్​ జయంతికి మోదీ అధ్యక్షతన కమిటీ - modi committee gutu tegh

శ్రీ గురు తేజ్​ బహదూర్‌ 400వ జయంతి ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తం 70 మందితో ఈ కమిటీని ప్రకటించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఈ కమిటీలో భాగమయ్యారు.

govt-sets-up-high-level-committee-to-commemorate-400th-birth-anniversary-of-shri-guru-tegh-bahadur
శ్రీ గురు తేగ్ జయంతికి మోదీ అధ్యక్షతన కమిటీ

By

Published : Oct 25, 2020, 5:46 AM IST

Updated : Oct 25, 2020, 6:22 AM IST

శ్రీ గురు తేజ్​ బహదూర్‌ 400వ జయంతి ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మొత్తం 70 మందితో ఈ కమిటీని రూపొందించింది.

జయంతి ఉత్సవ కార్యక్రమానికి సంబంధించి విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాల పర్యవేక్షణకు కమిటీ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఉన్నారు.

వీరితోపాటు.. కాంగ్రెస్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌, ఆకాలీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, పలువులు ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి-బాబియా... ఇదొక శాకాహార మొసలి

Last Updated : Oct 25, 2020, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details