తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్ ఆస్తులు, అప్పుల పంపకాల కోసం సలహా కమిటీ - ఆర్టికల్ 370 రద్దు

కశ్మీర్​లో నూతనంగా ఏర్పాటుకానున్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆస్తులు, అప్పుల పంపకాల కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. మాజీ భద్రతా కార్యదర్శి సంజయ్​ మిత్రా.. ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు.

కశ్మీర్ ఆస్తులు, అప్పుల పంపకాల కోసం సలహా కమిటీ

By

Published : Sep 10, 2019, 5:10 AM IST

Updated : Sep 30, 2019, 2:10 AM IST

అక్టోబరు 31 నుంచి కశ్మీర్​ అధికారికంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లుగా ఏర్పాటు కానుంది. కశ్మీర్​కు సంబంధించిన ఆస్తులు, అప్పులను ఈ రెండు ప్రాంతాలకు పంచేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. మాజీ భద్రతా కార్యదర్శి సంజయ్​ మిత్రా నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్​, విశ్రాంత ఐసీఎఎస్​ అధికారి గిరిరాజ్ ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.

జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 లోని సెక్షన్ 84, 85 అధికారాల ద్వారా కేంద్రం సలహా కమిటీని ఏర్పాటు చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

సెక్షన్ 84 ప్రకారం కశ్మీర్ ప్రస్తుత ఆస్తులు, అప్పులను కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లకు పంచాల్సి ఉంటుంది.

సెక్షన్ 85 ప్రకారం కశ్మీర్ ఆస్తులు,అప్పుల పంపకాల కోసం ఒకటి లేదా అంతకు మించి సలహా కమిటీలను నియమించవచ్చు కేంద్రం.

ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు తెలిపింది. సలహా కమిటీ సూచనల మేరకే పంపకాలు ఉంటాయని కేంద్రం పేర్కొంది.

Last Updated : Sep 30, 2019, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details