లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కరవై, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కార్మికులు. ఓవైపు ఉపాధి లేక, మరోవైపు వేతనాలు రాక తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించే దిశగా 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర కార్మిక శాఖ. వలసకూలీలు కూడా తమ సమస్యలను చెప్పుకునేందుకు ఈ కాల్సెంటర్లను సంప్రదించవచ్చని తెలిపింది.
ఇవాళ్టితో లాక్‌డౌన్ ముగిసి.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కార్మికులు ఎదురుచూశారు. అయితే.. తాజాగా మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కార్మికుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ అభిప్రాయపడింది.
సీఎల్‌సీ ఆధ్వర్యంలో రోజూ పర్యవేక్షణ