దేశంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు గానూ కేంద్ర నిల్వలు (బఫర్ స్టాక్) నుంచి లక్ష టన్నుల ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు తోమర్.
" ఉల్లి ధరల పెరుగుదలపై కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. నాఫెడ్ ద్వారా కేంద్రం ఆధ్వర్యంలోని లక్ష టన్నుల బఫర్ స్టాక్‌ను విడుదల చేయనున్నాం. సరైన సమయంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించాం. అలాగే దిగుమతులకు మార్గం సుగమం చేశాం."
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.