తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు సరోగసీ బిల్లు - రాజ్యసభ వార్తలు

సరోగసీ బిల్లుపై పెద్దల సభలో అభ్యంతరాల నేపథ్యంలో రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు అప్పగించింది ప్రభుత్వం. ఇందుకోసం 23 సభ్యుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది.

రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు సరోగసీ బిల్లు

By

Published : Nov 21, 2019, 10:46 PM IST

సరోగసీ బిల్లును 23 సభ్యుల రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య పరమైన సరోగసీ విధానంపై నిషేధం విధించాలని ఈ బిల్లును ప్రతిపాదించింది ప్రభుత్వం.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానానికి ఆమోదం లభించింది.

అభ్యంతరాల నేపథ్యంలో..

లోక్​సభలో ఆమోదం లభించిన సరోగసీ బిల్లుపై ఎగువ సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై పలువురు సభ్యులు సవరణలను ప్రతిపాదించారు. చట్టప్రకారం పెళ్లి అయి 5 ఏళ్లు గడిచిన వారికి.. వారి సమీప బంధువు దాతగా వ్యవహరించటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల నిబంధననూ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు కేంద్ర మంత్రి.

ఈ బిల్లుపై వచ్చే సమావేశాల చివరి రోజు సెలక్ట్​ కమిటీ తమ నివేదిక అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు హర్షవర్ధన్. అయితే కమిటీ ఛైర్మన్​ ఎవరన్నదీ ఆయన ప్రకటించలేదు.

ఇదీ చూడండి:పార్లమెంటును తాకనున్న బ్యాంకుల విలీన వ్యతిరేక సెగ

ABOUT THE AUTHOR

...view details