దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హైదరాబాద్ పశువైద్యురాలు దిశ హత్యాచార ఘటనపై లోక్సభ వేదికగా స్పందించారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ ఉదంతం దేశానికి సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.
దిశ: 'నిబంధనలు కఠినతరం చేసేందుకు కేంద్రం సిద్ధం! - రాజ్నాథ్
హైదరాబాద్ దిశ హత్యాచార ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజ్నాథ్. ఈ ఉదంతం దేశానికే సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని లోక్సభ వేదికగా స్పష్టం చేశారు.
'దిశ ఘటన సిగ్గు చేటు.. చర్చించేందుకు కేంద్రం సిద్ధం'
మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టంలోని నిబంధనల మార్పుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రక్షణమంత్రి.