వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లును పార్లమెంటరీ సంయుక్త కమిటీకి పంపాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వ్యక్తిగత గోప్యత పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పింది.
ఈ ఒక్క బిల్లు కోసమే ఏర్పాటయ్యే పార్లమెంటరీ కమిటీ రాబోయే బడ్జెట్ సమావేశాలలోగా నివేదిక సమర్పిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్సభలో తెలిపారు. ఆ తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని స్పష్టంచేశారు.