రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దమణ్ దీవ్, దాద్రానగర్ హవేలీని పరిపాలనా సౌలభ్యం తదితర కారణాలతో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రెండింటిని ఒకటే యూటీగా మార్చే దాద్రానగర్ హవేలీ, దమణ్దీవ్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లు 2019ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు.
దమణ్ దీవ్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 35 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు సచివాలయాలు ఉన్నాయి. దాద్రానగర్ హవేలీలో ఒక జిల్లా ఉండగా... దమణ్ దీవ్లో రెండు జిల్లాలు ఉన్నాయి.