పీడీపీ అధినేత్రి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని సోమవారం ఆ పార్టీ నేతలు కలవనున్నారు. రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న ఆమెను కలిసేందుకు అధికారులు అనుమతించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాను ఆ పార్టీ నేతలు కలిసిన కొన్ని గంటలకే ఈ నిర్ణయం వెలువడింది.
మెహబూబా ముఫ్తీతో పార్టీ నేతల భేటీకి అనుమతి - scrapping of article 370
గృహ నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసేందుకు పీడీపీ నాయకులకు అనుమతి లభించింది. నేడు ఆమె నివాసానికి వెళ్లి కలవనున్నారు నేతలు.
మెహబూబా ముఫ్తీ
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతలను గృహ నిర్బంధంలో పెట్టింది ప్రభుత్వం. మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలు 2 నెలలుగా నిర్బంధంలోనే ఉన్నారు.
ఇదీ చూడండి: ఫరూక్‌తో నేతల భేటీ- '370' పునరుద్ధరణే లక్ష్యం!
Last Updated : Oct 7, 2019, 5:34 AM IST