కరోనా వైరస్‌తో పాటు ఆర్థికపరంగా ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. తాను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫలితంగా రానున్న 6 నెలల పాటు ప్రజలు తీవ్ర కష్టాన్ని ఎదుర్కొంటారన్నారు.
"నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నా(ఆర్థిక అంశంపై). అయినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలనే దానిపై వారికే స్పష్టత లేదు. భారత్ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కరోనాపైనే కాదు.. ఆర్థికపరంగా మనకు ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కవడానికీ సిద్ధంగా ఉండాలి. దీని గురించి నేను పదే పదే చెప్తూనే ఉన్నా. కానీ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. రానున్న 6 నెలల్లో మన ప్రజలు ఊహించని రీతిలో బాధను అనుభవించబోతున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నా."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.