ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే దేశంలోని పేదలందరకీ నేరుగా నగదు సాయం అందించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. వినియోగం ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని సూచించారు.
కరోనా సంక్షోభం నుంచి బయటపడి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే భారీ సంస్కరణలు అవసరమని, ప్రభుత్వ వినియోగమే కీలకమని ఆర్బీఐ తెలిపిన మరునాడే ట్వీట్ చేశారు రాహుల్.