సరిహద్దుల వద్ద చైనాతో ఏర్పడ్డ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధత చాటుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనాతో వివాదంపై ప్రభుత్వ మౌనం తీవ్రమైన ఊహాగానాలకు, అనిశ్చితికి తావిస్తున్నందున.. ఈ అంశంలో కచ్చితంగా ఏం జరుగుతుందో బయటపెట్టాలని ట్విట్టర్ వేదికగా ఆయన సూచించారు.
'సరిహద్దు వివాదంలో కేంద్రం నిబద్ధత చాటుకోవాలి' - సరిహద్దు వివాదంపై కేంద్రానికి రాహుల్ సూచన
భారత్ చైనా సరిహద్దుల వద్ద ఏర్పడ్డ వివాదంపై కేంద్రం తన నిబద్ధతను చాటుకోవాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ అంశంలో కచ్చితంగా ఏం జరుగుతుందో బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
సరిహద్దు వివాదంపై కేంద్రానికి రాహుల్ సూచన
లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద ఇరుపక్షాల సైనికుల మోహరింపు, ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.
ఇదీ చూడండి:'సరిహద్దు'పై సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు!