తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2020, 12:01 PM IST

ETV Bharat / bharat

'భయపడకండి.. నిత్యావసరాల కొరత ఉండదు'

21రోజుల లాక్​డౌన్​ సమయంలో నిత్యావసరాలు, ఆహార ఏర్పాట్లపై.. ప్రజలు ఆందోళనపడొద్దని కేంద్రం భరోసా ఇచ్చింది. ఎక్కడా కొరత లేకుండా ఆయా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో వందతుల వ్యాప్తిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది.

govt-monitoring-availability-of-essential-commodities-in-market-paswan
'భయపడకండి.. నిత్యావసరాల కొరత ఉండదు'

భారతీయులను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. దీనితో పాటు 21 రోజుల లాక్​డౌన్​పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అందరి ప్రశ్న నిత్యావసరాలపైనే. ముఖ్యంగా ఆహార ఏర్పాట్లపై అనేక సందేహాలున్నాయి. అయితే.. ప్రజలు తమ సందేహాలు విడిచిపెట్టాలని కేంద్రం చెబుతోంది. ఆహారం విషయంలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ తెలిపారు. మార్కెట్లల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు.

వైరస్​ పేరుతో ఉత్పత్తిదారులు, ట్రేడర్లు.. ధరలను ఇష్టానుసారంగా పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పాసవాన్​. నిత్యావసర వస్తువుల కొరత ఉండకుండా.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు స్పష్టం చేశారు.

'వదంతుల వస్తే.. ఇక అంతే'

21రోజుల లాక్​డౌన్​ నేపథ్యంలో.. కరోనాపై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు పలు సూచనలు జారీ చేసింది.

సూచనలేంటంటే..

  • అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్రంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
  • ముఖ్యమైన, అవసరమైన వస్తువులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలపాలి.
  • అవసరమైన వస్తువుల సరఫరా కొనసాగించడానికి వీలుగా జిల్లా పరిపాలన, పోలీసుల మధ్య సమన్వయం ఉంచేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి.
  • ఆహారం, మందులు, నిత్యావసరాలపై స్థానిక పాలనా యంత్రాంగం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలి.
  • ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు చెప్పి.. వారిలో భరోసా నింపాలి.
  • ఎక్కడా ఆహార, నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా.. స్థానిక పాలనా యంత్రాంగం చర్యలు చేపట్టాలి.

ఇదీ చూడండి:-రోడ్డెక్కితే ముగ్గులో కూర్చోబెడతారు జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details