ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్‌లోనూ ఇప్పటి వరకు ఇద్దరికి ఈ వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. చైనాను ప్రయాణాలు రద్దు చేసుకోవాలని దేశప్రజలకు సూచించింది. జనవరి 15 తర్వాత చైనాలో పర్యటించిన వారందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా తెలిపింది. పొరుగుదేశాల నుంచి వచ్చిన వారికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షకు ఆరోగ్య, విదేశాంగ, హోం, పౌరవిమానయాన శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.