పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కరోనాపై యుద్ధం జరుగుతున్న తరుణంలో.. ధరలను తగ్గించాల్సింది పోయి పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కరోనాపై యుద్ధం కారణంగా దేశంలోని కోట్లాది మందికి ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ధరలు తగ్గించాల్సింది పోయి, వాటిని రూ.10-13కు పెంచింది. ఇది అన్యాయం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
లీటరు పెట్రోల్‌పై రూ.10, లీటర్ డిజిల్‌పై రూ.13 మేర ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు.
అయితే ఈ పెంపు వల్ల రీటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల పెరిగిన ఈ ధరలను చమురు కంపెనీలు సర్దుబాటు చేసుకుంటాయి.