రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో గంగానది ప్రక్షాళనపై చర్చ జరిగింది. గంగా ప్రక్షాళనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రూ. 28 వేల కోట్లతో 298 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో 98 ప్రాజెక్టులు కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. మిగతా ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గంగా ప్రక్షాళనను 100 శాతం కేంద్ర నిధులతో చేపట్టామన్నారు షెకావత్.
150 మురుగునీటి ప్రాజెక్టులను రూ. 23,130 కోట్లతో మంజూరు చేశామన్నారు. దీనివల్ల మురుగునీటిని తరలించేందుకు కృషి చేశామని వెల్లడించారు. శుద్ధీకరణ పనులను 4972.35 కిలోమీటర్ల మేర చేపట్టామని సభకు నివేదించారు.