కరోనా రోగులకు సేవలందిస్తూ వైరస్‌పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నవైద్యుల పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వారికి సరైన రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రాహుల్.
ప్రభుత్వ నిస్సహాయత కారణంగానే దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 196 మంది వైద్యులు వైరస్ బారినపడి మరణించారని చెప్పారు రాహుల్. ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.