తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ కోసం మంత్రుల బృందం ఏర్పాటు - నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్​ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఆ ప్రాంత సమస్యలపై దృష్టి సారించేందుకు ప్రత్యేకంగా మంత్రుల బృందం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

నరేంద్ర మోదీ

By

Published : Aug 28, 2019, 2:32 PM IST

Updated : Sep 28, 2019, 2:39 PM IST

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఆంక్షలు విధించిన కేంద్రం ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం మంత్రుల బృందం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది.

ఈ బృందంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్, సామాజిక న్యాయ మంత్రి ధావర్​ చంద్​ గహ్లూత్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్, ప్రధాని కార్యలయ మంత్రి జితేంద్ర సింగ్​ ఈ బృందంలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది.

సామాజికంగా, ఆర్థికంగా జమ్ముకశ్మీర్​ను అభివృద్ధి చేసేందుకు ఈ బృందం సలహాలు, సూచనలు చేయనుంది. అక్టోబర్​ 31న జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: '370పై రాజ్యాంగ ధర్మాసనం.. అక్టోబర్​లో విచారణ'

Last Updated : Sep 28, 2019, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details