తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నలుగురు సుప్రీం జడ్జిల నియామకానికి కేంద్రం పచ్చజెండా - బోపన్న

కొత్తగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తులకే పదోన్నతులు కల్పించనుంది.

నలుగురు సుప్రీం జడ్జీల నియామకానికి కేంద్రం పచ్చజెండా

By

Published : May 22, 2019, 5:45 PM IST

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన నలుగురు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాయంత్రం లేదా గురువారం ఉదయం గానీ రాష్ట్రపతి.. న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు వెలువరించొచ్చని విశ్వసనీయ సమాచారం.

ఈ నియామకాలు అధికారికంగా పూర్తయితే, ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుకుంటుంది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో 27 మంది న్యాయమూర్తులు మాత్రమే సేవలు అందిస్తున్నారు.

కొలీజియం సిఫారసే నెగ్గింది...

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని కొలీజియం... సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్​ అనిరుద్ధ​ బోస్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నలనూ... అలాగే జస్టిస్​ బీఆర్ గవాయ్​, జస్టిస్​ సూర్యకాంత్​ల పేర్లనూ సూచించింది.

కేంద్రం అభ్యంతరం

ఇంతకు ముందు కొలీజియం సిఫారసు చేసిన జస్టిస్ బోస్​, జస్టిస్ బోపన్నల పేర్లను.. వారి సీనియారిటీ, ప్రాంతాల ప్రాతినిధ్యం కారణాలుగా చూపించి కేంద్రం తిప్పి పంపించింది. ఈ అభ్యంతరాలను తోసిపుచ్చిన కొలీజియం పదోన్నతికి యోగ్యతే ప్రధానమని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావడానికి వారికి ఉన్న అర్హత, ప్రవర్తన, సమగ్రతలో తమకు ఎలాంటి ప్రతికూలతలు కనిపించలేదని స్పష్టం చేసింది.

తీవ్ర తర్జనభర్జనల తర్వాత తాజాగా వారి నియామకానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఇదీ వీరి నేపథ్యం..

జస్టిస్​ బోస్​ ప్రస్తుతం ఝార్ఖండ్​ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత జడ్జిల సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. జస్టిస్​ బోపన్న ప్రస్తుతం గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.

జస్టిస్​ బీఆర్​ గవాయ్​ బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్​ కాంత్​ హిమాచల్​ప్రదేశ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

ఇదీ చూడండి:రాహుల్​పై ఎఫ్​ఐఆర్​ కోరిన కేసు తీర్పు వాయిదా

ABOUT THE AUTHOR

...view details