తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేబినెట్​: రైల్వే ఉద్యోగులకు బోనస్​... ఈ-సిగరెట్లపై నిషేధం - ఈ-సిగరెట్లు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రెండు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత అందించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధానికి పచ్చజెండా ఊపింది.

కేబినెట్: రైల్వే ఉద్యోగులకు బోనస్-ఈ సిగరెట్లపై నిషేధం

By

Published : Sep 18, 2019, 5:28 PM IST

Updated : Oct 1, 2019, 2:12 AM IST

ఈ-సిగరెట్లపై నిర్మల సీతారామన్ ప్రకటన

పండగ వేళ రైల్వే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారంగా బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది.

రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ప్రతిఫలాన్ని అందించడం వరుసగా ఇది ఆరో ఏడాది. 11 లక్షల ఉద్యోగులకు ఇచ్చే ఈ బోనస్​తో ఖజానాపై రూ. 2వేల కోట్ల అదనపు భారం పడనుంది.

ఈ-సిగరెట్లపై నిషేధం...

పొగ రహిత ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధించింది కేబినెట్. ఎలక్ట్రానికి సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లు యువత ఆరోగ్యానికి చేటు చేస్తాయని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్​.

"4 వందల పైచిలుకు ఈ-సిగరెట్ బ్రాండ్లు, 150 రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది వాడటానికి, ఉపయోగించడానికి చాలా సులభం. ఇది సరికాదు... సాధారణ సిగరెట్లు తాగితే వాసన ద్వారా గుర్తు పట్టవచ్చు. కానీ ఈ-సిగరెట్లలో ఈ అవకాశం లేదు. ఈ- సిగరెట్ల ద్వారా బయటకు వదిలే నికోటిన్​ను చుట్టుపక్కల ఉన్నవారు పీల్చితే వారిపై అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ-సిగరెట్ల కారణంగా అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాల్లో దుష్ప్రభావం చూపింది. దేశ పౌరులను.. ప్రత్యేకంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఈ-సిగరెట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కేబినెట్ భావిస్తోంది."

-నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి

ఇదీ చూడండి: ఆదివాసీల 'రివర్స్​ గేర్'​ గడియారం కథ ఇది!

Last Updated : Oct 1, 2019, 2:12 AM IST

ABOUT THE AUTHOR

...view details