లాక్డౌన్ అమల్లో ఉన్నా దుకాణాలు తెరవడంపై మరింత స్పష్టత ఇచ్చింది కేంద్రహోంశాఖ. మునిసిపాలిటీలు, నగర కార్పొరేషన్లలోని నివాస ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, విడిగా ఉండే షాపులను తెరవొచ్చని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దుకాణాల పునఃప్రారంభంపై వేరువేరు సూచనలు చేసింది.
గత రాత్రి ఇచ్చిన ఉత్తర్వులపై కాస్త గందరగోళం నెలకొన్న తరుణంలో తాజా ప్రకటన చేసింది హోంశాఖ.
- గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరిచేందుకు అనుమతి.
- పట్టణాలు, నగరాల్లో మార్కెట్లు, మార్కెట్ ప్రాంతాల్లో ఉండే షాపులు, షాపింగ్ మాల్స్‌లోని దుకాణాల పునఃప్రారంభంపై నిషేధం.
- ఈ-కామర్స్ సంస్థలు నిత్యావసర సరుకులు మాత్రమే సరఫరా చేసేందుకు అనుమతి.
- మద్యం సహా నిషేధిత జాబితాలో ఉన్న అన్నింటికీ ఈ మినహాయింపులు వర్తించవు.
- వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులకు అవకాశం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మాత్రమే వర్తిస్తాయి.
వైరస్ నియంత్రణ విధానాలతోనే..