కరోనా ఆంక్షల కారణంగా విధించిన ఎగుమతి నిబంధనలను పాక్షికంగా సడలించిన నేపథ్యంలో.. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అనుమతి ఇచ్చింది. నెలవారీ ఎగుమతుల్లో 50 లక్షల యూనిట్లను విదేశాలకు పంపేందుకు అంగీకరించింది.
పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం ఓకే - విదేశాలకు పీపీఈ కిట్ల ఎగుమతి
విదేశాలకు పీపీఈ కిట్లు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ఆంక్షల్లో భాగంగా విధించిన ఎగుమతి నిబంధనలను పాక్షికంగా సడలించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.
పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం అనుమతి
'భారత్లో తయారీ'కి ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.