మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం. దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన వ్యవహారంలో గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతి బాధ్యత వహించాలన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా దిల్లీ కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చిదంబరం.
"ఆ విధంగా వారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ రకంగా వారు రాజ్యాంగానికి గౌరవం ఇచ్చారు. అర్ధరాత్రి వ్యవహారానికి గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి బాధ్యత వహించాలి. ఈ ప్రక్రియలో రాష్ట్రపతి పాలుపంచుకోవటం విచారకరం. ఉదయం నాలుగింటికి రాష్ట్రపతిని నిద్రలేపినందుకు నేను చాలా బాధపడుతున్నాను."
- పి. చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత