కరోనా వైరస్ కేసులు మరింతగా పెరిగిపోయి, ఒక వేళ ఆసుపత్రుల్లో పడకలు సరిపోకపోతే రైళ్లలో ద్వితీయ శ్రేణి (సెకెండ్) ఏసీ పెట్టెలను సంచార ఆసుపత్రులుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలన్నీ రద్దు అయి పెట్టెలన్నీ ఖాళీగా పడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
రైళ్లల్లో సంచార ఐసోలేషన్ వార్డులు! - రైళ్లలో ఏకాంత వార్డులు
కరోనా కేసులు ఇంకా పెరిగిపోయి ఆసుపత్రుల్లో పడకలు సరిపోకపోతే.. రైళ్లలోని సెకండ్ ఏసీ పెట్టెలను సంచార ఆసుపత్రులుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైనిక అవసరాలకు వాడే రైలు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు.
రైళ్లలో సంచార ఐసోలేషన్ వార్డులు!
రోగుల్ని, కరోనా సోకినట్లు అనుమానం ఉన్నవారిని ఎవరితోనూ కలవనీయకుండా ఉంచేందుకు 'ఐసోలేషన్ వార్డులు'గా సెకెండ్ ఏసీ రైలు పెట్టెల్ని వాడుకోవాలని భావిస్తున్నారు. సైనిక అవసరాలకు వాడే రైలు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉన్నతాధికారి ఒకరు ఈటీవీ భారత్ ప్రతినిధికి తెలిపారు. సెకెండ్ ఏసీ పెట్టెల్లో కొద్ది పాటి మార్పులు చేసి, వెంటిలేటర్లు సహా వైద్య పరికరాలను అమర్చుకుంటే అవి సంచార ఆసుపత్రులుగా మారిపోతాయని వివరించారు.