తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష పోస్టులు ఖాళీ - Central Armed Police Forces news

కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్ష ఖాళీలు ఉన్నట్లు తెలిపింది కేంద్రం. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని పేర్కొంది.

Over 1 lakh vacancies in CAPFs: Govt
కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష ఖాళీలు

By

Published : Sep 21, 2020, 3:44 PM IST

బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది. ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

ఖాళీల జాబితా...

అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు నిత్యానంద్​. సీఆర్‌పీఎఫ్‌లో 26,506, సీఐఎస్‌ఎఫ్‌లో 23,906, ఎస్ఎస్‌బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో చాలా వరకు కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులేనన్నారు. నిర్ధారిత ప్రక్రియ ద్వారానే వీటిని భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. వీటిలో కొన్ని పదోన్నతులు, డిప్యూటేషన్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరికొన్నింటికి కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు.

కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం 60,210 కానిస్టేబుల్‌, 2,534 ఎస్ఐ పోస్టులు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా.. 330 అసిస్టెంట్‌ కమాండెట్స్‌ పోస్టుల్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details