పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిలో భాగంగా ఆ దేశానికి 10 బ్రాడ్‌గేజ్ డీజిల్ లోకోమోటివ్‌లను భారత్ పంపింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లు సోమవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బంగ్లాకు బయలుదేరిన ఇంజిన్లకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో బంగ్లా నుంచి ఆ దేశ రైల్వే మంత్రి నురుల్ ఇస్లామ్ సుజన్, విదేశీ వ్యవహారాల మంత్రి అబుల్ కలామ్ అబ్దుల్ మోమెన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జయశంకర్... రెండు దేశాల మధ్య రైల్వే భాగస్వామ్యం మరింత మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. గోయల్ మాట్లాడుతూ.. రెండు దేశాల అర్థిక భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడంలో రైల్వే శాఖల సహకారం కీలకమైందన్నారు.