కరోనా వ్యాప్తి కట్టడి, ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజమే లక్ష్యంగా లాక్డౌన్ 5.0 అమలుకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. మరో నెల పాటు కంటైన్మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలను కొనసాగిస్తూ... ఇతర ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 3 దశల వ్యూహాన్ని రూపొందించి... సంబంధిత విధివిధానాల్ని ప్రకటించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ 4.0 ఆదివారంతో ముగుస్తుంది. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు దాదాపు ప్రస్తుతమున్న ఆంక్షలే కొనసాగుతాయి. రాత్రి కర్ఫ్యూ మాత్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఎలాంటి అనుమతులు, ఈ-పాస్లు లేకుండానే అంతర్రాష్ట్ర రవాణాకు వీలు కలగనుంది.
జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకుంటాయి. విద్యా సంస్థల పునఃప్రారంభంపై సంబంధిత పక్షాలతో చర్చించాకే నిర్ణయం తీసుకోనున్నారు.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు
త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే... లాక్డౌన్ నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నీరుగార్చకూడదని తేల్చిచెప్పింది కేంద్రం. ఆంక్షలు ఉల్లంఘించినవారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కరోనా కట్టడే లక్ష్యంగా మార్చి 24న 21 రోజుల లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత మే 3న ఒకసారి, మే 17న మరోసారి పొడిగించారు. అయినా వైరస్ వ్యాప్తి అదుపులోకి రానందున లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు మే 17న ప్రకటించారు. ఇప్పుడు జూన్ 1 నుంచి లాక్డౌన్ 5.0 అమలుకు సిద్ధమయ్యారు.