తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 కుటుంబాలకు 'రేషన్​' నిలిపివేత నిర్ణయం వెనక్కి.. - gautami panchayat ration cut news

ఒడిశా గంజాం జిల్లాలోని ఓ గ్రామంలో 24 కుటుంబాలకు రేషన్ నిలిపివేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు సర్పంచ్​. గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఎదురైనందున తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

24 కుటుంబాలకు 'రేషన్​' నిలిపివేత నిర్ణయం వెనక్కి..

By

Published : Nov 3, 2019, 9:00 PM IST

Updated : Nov 3, 2019, 9:59 PM IST

24 కుటుంబాలకు 'రేషన్​' నిలిపివేత నిర్ణయం వెనక్కి..

ఒడిశా గంజాం జిల్లాలో బహిరంగంగా మలవిసర్జన చేసినందుకు గౌతమి​ గ్రామంలో 24 కుటుంబాలకు రేషన్ రద్దు చేశారు సర్పంచ్​ సుశాంత్ స్వైన్​. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

రేషన్​ రద్దును గ్రామ పంచాయతీలోని ప్రజలు వ్యతిరేకించినందుకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు స్వైన్. వీరందరికీ నవంబరు 10లోపు రేషన్​ అందుతుందన్నారు.

ఇదీ జరిగింది

అక్టోబర్ 27, 28 తేదీల్లో సంఖేముండి పరిధిలోని గౌతమిలో జాతీయ, రాష్ట్ర ఆహార భద్రతా చట్టాల కింద నెలవారీ రేషన్​ను పంపిణీ చేశారు. 24 కుటుంబాలకు మాత్రం రేషన్​ ఇచ్చేందుకు నిరాకరించారు స్వైన్. వారంతా బహిరంగ మలవిసర్జన చేస్తుండటమే ఇందుకు కారణం. ఇది మరోసారి పునరావృతం కావొద్దని వాళ్లని సున్నితంగా మందలించారు.

అయితే స్వైన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్యతో వారంతా జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం వారికున్న హక్కును కోల్పోతున్నారని పలువురు తెలిపారు. అధిక శాతం మహిళలు నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

సంఖేముండి పరిధిలోని 400 కుటుంబాలు ఇళ్లలో ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోలేదని బీడీవో(బ్లాక్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్​) తెలిపారు. స్వఛ్చ భారత్​ కార్యక్రమం కింద 2నెలల్లో వీటి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామన్నారు.

ఇదీ చూడండి: ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?

Last Updated : Nov 3, 2019, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details