గూగుల్ మ్యాప్స్ కాపురాలు కూల్చుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమిళనాడుకు చెందిన చంద్రశేఖరన్.
నాగపట్టణం జిల్లా మైలదురైకి చెందిన ఆర్ చంద్రశేఖరన్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంది. ఎప్పటికప్పుడు అతడి కదలికలను గమనించేందుకు చంద్రశేఖరన్ భార్య గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్ చెక్ చేస్తూ ఉంటుంది. అయితే మే 20న చంద్రశేఖరన్.. భార్య చేతికి ఫోన్ ఇచ్చి బుక్కైపోయాడు.
'నేనెక్కడికెళ్లా..?'
టైమ్‌లైన్‌లో రికార్డైన గూగుల్ మ్యాప్ హిస్టరీ చూసింది చంద్రశేఖరన్ భార్య. అంతే.. 'ఆ సమయానికి అక్కడికెందుకు వెళ్లావు?' అని ఎర్రటి కళ్లతో ప్రశ్నించింది. 'ఎక్కడికి?' అమయాకంగా బదులిచ్చాడు చంద్ర శేఖరన్. 'ఇక్కడంతా స్పష్టంగా కనిపిస్తుంది.. నువ్వెళ్లావ్!' అని కసిరింది. 'అబ్బే నేనెక్కడికీ వెళ్లలేదే' అని ఎన్ని రకాలుగా చెప్పినా చంద్రశేఖరన్ భార్య మాత్రం.. గూగుల్ మ్యాప్స్నే నమ్మింది. తాను వెళ్లని ప్రదేశాలను గూగుల్‌మ్యాప్స్ తప్పుగా రికార్డు చేసిందని.. మొరపెట్టుకున్నా వినలేదు.
కాపురంలో చిచ్చు పెట్టిన గూగుల్ మ్యాప్స్పై ఫిర్యాదు! ఇక చంద్రశేఖరన్‌కు మనఃశాంతి కరవైంది. భార్య అనుమానానికి కారణమైన గూగుల్మ్యాప్స్పై కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు. తన ప్రశాంతతకు భంగం కలిగించిన గూగుల్ మ్యాప్స్ తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఇదీ చదవండి: జూమ్‌కాల్ లైవ్‌లో తండ్రిని పొడిచి చంపిన కుమారుడు