తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​ను బ్లాక్​ చేసిన గూగుల్​, యాపిల్​ - గూగుల్​

గూగుల్​, యాపిల్​ సంస్థలు యాప్​ స్టోర్ల​ నుంచి టిక్​టాక్ యాప్​​ను తొలగించాయి. కేంద్రప్రభుత్వ సూచన మేరకు ఈ పని చేశాయి.

టిక్​టాక్​ను బ్లాక్​ చేసిన గూగుల్​, యాపిల్​

By

Published : Apr 17, 2019, 4:52 PM IST

టిక్​టాక్​ను బ్లాక్​ చేసిన గూగుల్​, యాపిల్​

ప్లే స్టోర్​, యాప్​ స్టోర్​ నుంచి వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ను తొలగించాయి గూగుల్​, యాపిల్​​. మద్రాస్​ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ సూచన మేరకు ఈ చర్యలు చేపట్టాయి.

ఇలా మొదలు...

చైనాకు చెందిన టిక్​టాక్​ను నిషేధించాలని ఈ నెల 3న కేంద్రాన్ని ఆదేశించింది మద్రాసు హైకోర్టు. ఈ యాప్​ సమాజంపై దుష్ర్పభావం చూపుతోందని అభిప్రాయపడింది. టిక్​టాక్​ యాప్​తో రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియా సంస్థలను ఆదేశించింది.

మద్రాస్​ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని టిక్​టాక్​ మాతృసంస్థ బైట్​డాన్స్​ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.

మద్రాస్​ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ కేంద్రం గూగుల్​, యాపిల్​కు లేఖలు రాసింది. న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఫలితంగా... టిక్​టాక్​ను గూగుల్​, యాపిల్​ యాప్​ స్టోర్ల నుంచి తొలగించాయి.

కొత్త డౌన్​లోడ్స్​ మాత్రమే కుదరవు...

"తాజా ఆంక్షలతో యాప్​ స్టోర్ల నుంచి టిక్​టాక్​ డౌన్​లోడ్​ చేసుకోవడం కుదరదు. ఇప్పటికే ఇన్​స్టాల్ చేసుకున్నవారు షేర్​ఇట్​ వంటి యాప్​ల ద్వారా ఇతరులకు టిక్​టాక్​ను పంపవచ్చు.

ఇలాంటి డిజిటల్​ మహమ్మారుల్ని ఎదుర్కొనేందుకు సమగ్ర విధానం అవసరం. సాంకేతికత, న్యాయపరమైన చర్యలు మాత్రమే సరిపోవు."
-ఫైసల్​ కవూసా, టెక్​ ఆర్క్​ వ్యవస్థాపకుడు

టిక్​టాక్​ యాప్​ దేశంలో ఇప్పటివరకు 23 కోట్లసార్లు డౌన్​లోడ్​ అయింది. 12 కోట్ల మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నారు.

ఇదీ చూడండి: 'కట్టు కథలు చెప్పను... పని చేసి చూపిస్తా'

ABOUT THE AUTHOR

...view details