తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు - మూడు ఇంజిన్లు దగ్ధం

కొత్తవలస-కిరండోల్​ రైలు మార్గంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు ఎలక్ట్రికల్​ ఇంజిన్లు పుర్తిగా కాలిపోయాయి. అందులో ఉన్న లోకో పైలెట్లకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

By

Published : Jan 5, 2021, 7:40 AM IST

goods train accident at dimili near visakhapatnam
ఘోర రైలు ప్రమాదం- మూడు ఎలక్ట్రికల్​ ఇంజన్​లు దగ్ధం

కొత్తవలస-కిరండోల్(కెకె లైన్)లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు ఎలక్ట్రికల్ ఇంజిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోకో పైలెట్లకు గాయాలైనట్లు సమాచారం. ఇంజిను వెనక భాగంలో ఉన్న దాదాపు 6 గూడ్స్ వేగన్లు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ క్రమంలో ట్రాక్ కూడా పాడైనట్లు తెలుస్తోంది. గూడ్స్​ రైలు కెకె లైన్ లోని జగదల్​పూర్ దాటిన తర్వాత దిలిమిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

గూడ్స్​ రైలు ప్రమాదం- మూడు ఎలక్ట్రికల్​ ఇంజన్​లు దగ్ధం

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లను రైల్వే అధికారులు నిలుపుదల చేశారు. దీనిపై సమాచారం అందుకున్న తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సమయంలో జరిగింది.

ఇదీ చూడండి: రెండుగా విడిపోయిన రైలు- తప్పిన పెను ముప్పు

ABOUT THE AUTHOR

...view details