తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మంచి ఆలోచనా విధానం గుండెకు మంచిది' - రాహుల్​ వార్తలు

భారత్​- చైనా సరిహద్దుల పరిస్థితులపై అమిత్​ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులేంటో అందిరికీ తెలుసున్న రాహుల్​.. మంచి ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని అమిత్​షాపై విమర్శలు చేశారు.

Good thought to keep heart happy says Rahul
మంచి ఆలోచనా విధానం గుండెకు మంచిది

By

Published : Jun 8, 2020, 2:34 PM IST

భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత సరిహద్దుల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ తరవాత సరిహద్దులను రక్షించుకోగల సామర్థ్యం భారత్‌కు ఉందంటూ షా చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు రాహుల్​.

'సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం.'

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో 'బిహార్ జన్‌సంవద్ వర్చువల్ ర్యాలీ'లో భాగంగా మాట్లాడిన అమిత్​ షా.. 'మన దేశ రక్షణ విధానం ప్రపంచ ఆమోదాన్ని పొందింది. అమెరికా, ఇజ్రాయెల్ తరవాత సరిహద్దులను పరిరక్షించుకోగల సామర్థ్యం ఉన్న దేశం భారత్ అని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంది.' అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:సీఎంకు గొంతునొప్పి- మంగళవారం కరోనా టెస్ట్

ABOUT THE AUTHOR

...view details