కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ప్రజాపనుల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ జరిమానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ప్రమాదాలకు మంచి రహదారులే కారణమన్నారు.
"మంచి, మామూలు రహదారులే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైవేలను చూడండి... 100, 160 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళతాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ చలానాలపై వ్యతిరేకతను నేను సమర్థిస్తాను. రాష్ట్ర కేబినెట్‌తో చర్చించి జరిమానాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటా."
-గోవింద్ కర్జోల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి