బంగాళాఖాతంలో అల్పపీడనంతో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నందున వచ్చే వారం నుంచి మధ్య, దక్షిణ భారత్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెల్లడించింది. అది రుతుపవనాల పురోగతికి సాయంగా మారనుందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ఒడిశా వైపుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర.
" అల్పపీడనం అనేది తుపాను ఏర్పడేందుకు కారణమవుతుంది. ఏ తుపానుకైనా ఇది తొలి దశ. అయితే.. ప్రతిసారి అల్పపీడనం తుపానుగా మారాలనేది లేదు. వచ్చే వారం ఏర్పడే అల్పపీడనం రుతుపవనాల పురోగతికి సాయంగా మారుతుంది. విస్తారంగా వర్షాలు పడతాయి. ఈశాన్య రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని కొంత భాగం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిని మరో రెండు రోజుల్లో తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి."