కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అరెస్టు శుభ వార్త అన్నారు ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జీ. చిదంబరానికి అన్ని దారులు మూసుకుపోయాయని హత్య కేసు విచారణ కోసం ముంబయి ప్రత్యేక న్యాయస్థానానికి హాజరైన సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఈ నెల 21 అరెస్టు చేశారు.
కుమార్తె షీనా బోరా హత్య కేసులో ముంబయిలో జైలు జీవితం గడుపుతున్నారు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ. ఐఎన్ఎక్స్ మీడియాకు వీరు ఒకప్పుడు ప్రమోటర్లు. చిదంబరానికి చెందిన సంస్థకు అక్రమంగా నిధులు అందించారని వీరు ఆరోపణలు ఎదుర్కొన్నారు.