తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధుమేహగ్రస్థుల కాళ్లనొప్పులకు లేజర్​ థెరపీతో చెక్ - Diabetes

మధుమేహం వల్ల వచ్చే కాళ్ల నొప్పులతో శక్తి నశిస్తోంది. భారతదేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఎయిమ్స్​ ఓ ముందడుగేసింది. అనేక పరిశోధనలు జరిపి ఎట్టకేలకు విజయవంతమైంది. కాళ్ల నొప్పులకు లేజర్​ థెరపీతో చికిత్స చేస్తే వందశాతం ఉపశమనం ఉంటుందని తేల్చిచెప్పింది.

మధుమేహగ్రస్థుల కాళ్లనొప్పులకు లేజర్​ థెరపీతో చెక్

By

Published : Aug 26, 2019, 7:09 PM IST

Updated : Sep 28, 2019, 8:47 AM IST

మధుమేహగ్రస్థుల కాళ్లనొప్పులకు లేజర్​ థెరపీతో చెక్

మధుమేహం అదుపులో లేకపోతే వచ్చే కాళ్ల, కీళ్ల నొప్పులను భరించడం పెద్ద సవాలే. అలాగని, నొప్పి తగ్గించేందుకు గంపెడు మాత్రలు, మరింత నొప్పి పుట్టించే శస్త్ర చికిత్సలూ చేయించుకోలేరు. అందుకే ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్​)​లోని జెరియాట్రిక్ విభాగం వైద్యులు ఓ పరిశోధన చేసి లేజర్​ థెరపీని కనుగొన్నారు.

" 40 మంది రోగులపై ప్రయోగం చేశాం. అందులో 20 మందికి కేవలం మందులే ఇచ్చాం. మరో 20 మందికి మందులతో పాటు లేజర్​ థెరపీ చేశాం. కేవలం మందులు వాడినవారికి నొప్పి తాత్కాలికంగానే తగ్గింది. కానీ, థెరపీ పొందినవారికి అసాధారణమైన ఉపశమనం కలిగిందని తెలిపారు. ఈ పరిశోధనలో ఈ లేజర్​ చికిత్స ఔషధాలకన్నా ప్రభావితంగా పని చేస్తుందని తేలింది."
-ప్రసోన్ ఛటర్జీ, ఎయిమ్స్ వైద్యుడు

కాళ్ల నొప్పులు సాధారణమే కదా అని, అశ్రద్ద చేస్తే తర్వాత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు వైద్యులు.

"డయాబెటిస్​ అధిక రోజులు అదుపులో ఉండకపోతే వారి కాళ్లలో ఉండే డైబెటిక్​ పెరిఫ్యురల్​ న్యూరోపతి ప్రభావితం అవుతుంది. అప్పుడు తీవ్రమైన నొప్పి, విసుగు, ఒంటరితనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల రాత్రుళ్లు నిద్ర ఉండదు. సాధారణ జీవనం నుంచి వేరైనట్లుగా ఉంటుంది. దీంతో డిప్రెషన్​లోకి వెళ్లే అవకాశం కూడా ఎక్కువే."
- ప్రసోన్ ఛటర్జీ, ఎయిమ్స్ వైద్యుడు

అందుకే మధుమేహంతో బాధపడేవారు, కాళ్ల నొప్పులకు ఎయిమ్స్​ కనుగొన్న లేజర్​ థెరపీని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నారు వైద్యులు.

Last Updated : Sep 28, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details