కొవిడ్-19పై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి మంత్రుల కమిటీ సమావేశమయింది. ఈ సమావేశంలో కరోనా కేసుల వృద్ధి రేటు సహా పలు కీలక గణాంకాలను వెల్లడించింది.
- దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులు.
- శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైంది.
- భారత్‌లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు.
రాష్ట్రాల వారిగా కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు, ఐసోలేషన్ బెడ్ల సామర్థ్యం, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు, ఔషధాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి వైద్య పరికరాల లభ్యతపై మంత్రుల బృందానికి వివరించినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
కిట్ల తయారీ ప్రారంభం..
వైరస్ రక్షణ కిట్లు (పీపీఈ), మాస్కుల కోసం ఇప్పటికే గుర్తించిన తయారీదారి సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయని వెల్లడించింది మంత్రుల బృందం.
"పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు దేశంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పీపీఈ కిట్ల తయారీలో 104 దేశీయ ఉత్పత్తి సంస్థలు భాగమయ్యాయి. ఎన్95 మాస్కులను మూడు సంస్థలు తయారుచేస్తున్నాయి."
-ఆరోగ్యశాఖ ప్రకటన
వెంటిలేటర్లకు సంబంధించి..