ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన స్వచ్ఛ భారత్కు ఫిదా అయిపోయి... ఆయనకు వీరాభిమానిగా మారాడు తమిళనాడు సేలంకు చెందిన శంకర్. మోదీపై తన అభిమానాన్ని చాటుకునేందుకు సూక్ష్మకళను ఎంచుకున్నాడు.
శంకర్ వృత్తిరీత్యా స్వర్ణకారుడు. తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి... మోదీ పుట్టిన రోజున బహూకరించడానికి వెండితో ఇంచులో మూడో వంతు పరిమాణంలో ఓ ప్రతిమను తయారు చేశాడు. మోదీ చీపురు పట్టి స్వచ్ఛ భారత్ చేపడుతున్నట్లు కనిపించే ఆ బుల్లి విగ్రహం బరువు 48గ్రాములు.