తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ స్వీట్ ఖరీదు కిలో రూ.11,000- ప్రత్యేకత ఇదే...

దీపావళి వేళ మిఠాయిలు ఇచ్చి పుచ్చుకోవడం భారత్​లో సంప్రదాయం. ఈ సందర్భంగా రకరకాల మిఠాయిలు అందుబాటులో ఉంచుతున్నారు దుకాణదారులు. మహారాష్ట్ర ఠానేలోని మిఠాయి దుకాణం తయారు చేసిన స్వీటు మీ నోటికి పసిడి పూత పూయిస్తుందంటే నమ్మండి!

ఆ స్వీట్ ఖరీదు కిలో రూ.11,000- ప్రత్యేకత ఇదే...

By

Published : Oct 27, 2019, 11:00 AM IST

Updated : Oct 27, 2019, 2:46 PM IST

ఆ స్వీట్ ఖరీదు కిలో రూ.11,000- ప్రత్యేకత ఇదే...

లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే దీపావళి వేళ మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా.. మీ నోరు బంగారం గానూ అంటూ మహారాష్ట్ర ఠానేలోని ఓ స్వీటుషాపు వినియోగదారులకు ఓ వినూత్న ఆఫర్ అందిస్తోంది. బంగారంతో చేసిన మిఠాయిలను అందుబాటులో ఉంచి పసిడి రుచిని ప్రజలకు అనుభవంలోకి తెస్తోంది.

బంగారాన్ని తినడం ఎలా అని మీ సందేహమా..? అదేనండీ.. స్వీటుపై ఉండే అలంకరణ కాగితాన్ని పసిడితో తయారు చేసింది ఈ దుకాణం. పుత్తడితో చేసిన ఈ మిఠాయి ధరా ఎక్కువేనండోయ్.! కిలో రూ. 11,000.

ఠానేలోని ప్రశాంత్ కార్నర్ అనే మిఠాయి దుకాణం ఈ బంగారు స్వీట్​ను తయారు చేసింది. దీపావళి సందర్భంగా ఏటా ఈ స్వీటును తయారు చేసి అమ్ముతుంటారు నిర్వాహకులు. ప్రజలు కూడా దీనిని కొనేందుకు అమిత ఆసక్తి చూపుతుంటారు.

ఇదీ చూడండి: డిసెంబరు 6లోపే రామ మందిర నిర్మాణం: సాక్షి మహరాజ్​

Last Updated : Oct 27, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details