బంగాల్ ఉత్తర పరగణ జిల్లా, గబోర్డంగా పట్టణం 150 ఏళ్ల క్రితమే అత్యాధునిక హంగులతో మెరిసింది. కానీ, ఇప్పుడు అక్కడ కార్లు కాదు కదా, ద్విచక్ర వాహనాలు కూడా తిరగలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లాలన్నా పడవలో పయనించాల్సిందే. మురికి నీటిలో తడవాల్సిందే.
నది కాదు.. నడి రోడ్డుపైనే పడవ ప్రయాణం - Gobordanga drowned area
బంగాల్లోని ఓ పట్టణం 15 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వీధుల్లో కార్లకు బదులు పడవలు ప్రయాణిస్తున్నాయి.

నది కాదు.. నడి రోడ్డు మీదే పడవ ప్రయాణం!
నది కాదు.. నడి రోడ్డు మీదే పడవ ప్రయాణం!
15 రోజుల కింద కురిసిన భారీ వానకు గబోర్డంగా జలమయమైంది. ఆ పట్టణం ఆధునిక భవనాలకు నెలవు కానీ, డ్రైనేజీ వ్యవస్థ లోపాల కారణంగా వర్షపు నీరు ఎక్కడిక్కడే నిలిచిపోయింది. రెండు వారాలు దాటినా కాలనీల్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు తంటాలు పడుతున్నారు.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లో 16 నాగరాజులు మకాం!