తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక! - అంతిమయాత్రలో పాల్గొన్న మేక

మూగజీవాలు..తమ యజమానులపై ఎంతగా అభిమానం, విశ్వాసం చూపుతాయనే దానికి.... కర్ణాటకలోని చిక్‌ మంగళూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.

మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!

By

Published : Oct 19, 2019, 6:26 PM IST

Updated : Oct 19, 2019, 7:44 PM IST

మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!

కర్ణాటక చిక్‌ మంగళూరు జిల్లాలోని కొప్పా నగరంలో ఓ మేక.. తన యజమాని అంతిమయాత్రలో పాల్గొని విశ్వాసాన్ని చాటుకుంది. హుసేనబ్బ అనే మత్స్యకారుడు చాలా ఏళ్ల నుంచి ఓ మేకను పెంచుతున్నారు. ఆయన శుక్రవారం గుండెపోటుతో మరణించారు.

ఇన్నాళ్లూ తనను పెంచిన యజమాని అకస్మాత్తుగా మరణించడం వల్ల ఆ మూగజీవం తల్లడిల్లింది. యజమాని అంతిమయాత్రలో కడదాకా పాల్గొని వీడ్కోలు పలికింది.

Last Updated : Oct 19, 2019, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details