తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోఎయిర్​ విమానంలో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

అహ్మదాబాద్​ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన గోఎయిర్​ విమానం ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. వెంటనే విహంగాన్ని నిలిపివేసి మంటలు అదుపుచేశారు అధికారులు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది విమానయాన సంస్థ.

GoAir flight
గోఎయిర్​ విమానంలో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

By

Published : Feb 18, 2020, 12:53 PM IST

Updated : Mar 1, 2020, 5:18 PM IST

అహ్మదాబాద్​ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గోఎయిర్​కు చెందిన ఓ విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో కుడివైపు ఉన్న ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది విహంగాన్ని నిలిపేశారు. వెంటనే మంటలు ఆర్పివేయటం వల్ల ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

బెంగళూరు-అహ్మదాబాద్​ మధ్య తిరిగే గోఎయిర్​ జీ8 802 విమానం అహ్మదాబాద్​ విమానాశ్రయం నుంచి ఇవాళ ఉదయం బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

"అహ్మదాబాద్​ నుంచి బెంగళూరుకు వెళ్లే గోఎయిర్​ విమానం టేకాఫ్​ సమయంలో కుడి ఇంజిన్​ ఫ్యాను రెక్కలు విరిగిపోయినట్లు అనుమానిస్తున్నాం. దానివల్ల ఇంజిన్​లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆర్పివేశాం. ప్రయాణికులతో పాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి అత్యవసర తరలింపు అవసరం లేదు. ప్రయాణికులకోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశాం. బెంగళూరు విమానాశ్రయ రన్​వే మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేసిన కారణంగా అహ్మదాబాద్​ నుంచి 1.30 గంటలకు ఈ విమానం బయలుదేరుతుంది. "

- గోఎయిర్​ సంస్థ

విమానం ఇంజిన్​లో మంటలు చెలరేగిన సమయంలో అందులో ఎంతమంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారో ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: మిడతల నివారణకు భారత్ ​వైపు పాక్​ చూపు!

Last Updated : Mar 1, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details