గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పారికర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది.
పారికర్ ఆరోగ్యం అత్యంత విషమం - గోవా ముఖ్యమంత్రి
గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. క్లోమగ్రంధి వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.
![పారికర్ ఆరోగ్యం అత్యంత విషమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2719987-391-7b733eec-5804-4582-bd89-e44a789cc6a9.jpg)
పారికర్ ఆరోగ్యం అత్యంత విషమం
63 ఏళ్ల పారికర్ క్లోమగ్రంధి కాన్సర్‌తో బాధపడుతున్నారు. కొంతకాలంగా అది విషమించింది. పలుమార్లు విదేశాల్లో చికిత్సపొందారు పారికర్. ముంబయి, దిల్లీల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లోనూ వైద్యం చేయించుకున్నారు. అనారోగ్యం వల్ల గతేడాది కొంతకాలం తన నివాసానికే పరిమితమయ్యారు పారికర్.
అధికారంలో కొనసాగేందుకు భాజపాకు మెజారిటీ లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శవివారమే గోవా గవర్నర్‌కు లేఖరాసింది.