దేశంలో కరోనా బారినపడే మంత్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ లక్షణాలు లేనందున స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సావంత్.
'నాకు కరోనా సోకినట్లు తేలింది. ఎలాంటి లక్షణాలూ లేకపోవడంవల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నా.'
- ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి