తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా గూటికి 10 మంది గోవా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు - CM

భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించిన గోవా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు నేడు అధికారికంగా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.  ఈ మేరకు కేబినెట్​ పునర్వ్యవస్థీకరించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా, ఇతర సీనియర్​ నాయకులతో భేటీ అయ్యారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​.

భాజపాలో చేరిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

By

Published : Jul 11, 2019, 7:21 PM IST

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న జేపీ నడ్డా

గోవాకు చెందిన 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గురువారం అధికారికంగా భాజపాలో చేరారు. దిల్లీలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యేలను ఆహ్వానించారు.

కేబినేట్​ పునర్​వ్యవస్థీకరణ!

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతో హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి సావంత్​... అమిత్​ షా, జేపీ నడ్డాలను కలిశారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతో గోవా కేబినేట్​ పునర్​వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కేబినేట్​లో ఉన్న కూటమి పార్టీల మంత్రుల శాఖలను తప్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో భాజపా బలం 17. తాజాగా 10 మంది కాంగ్రెస్​ ఎమెల్యేల చేరికతో ఆ సంఖ్య 27కు చేరింది. దాంతో కూటమి పార్టీలపై ఆధారాపడాల్సిన అవసరం లేకుండాపోయింది.

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించిందని భాజపాపై కాంగ్రెస్​ నాయకులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్​ ఆరోపణలను తిప్పికొట్టారు ముఖ్యమంత్రి సావంత్​. ఎమ్మెల్యేలు వారి ఇష్టపూర్వకంగానే భాజపాలో చేరినట్లు స్పష్టం చేశారు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు.

సొంత పార్టీ నుంచే వ్యతిరేకత...

10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటంపై దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ కుమారుడు ఉత్పల్​తో పాటు పలువురు భాజపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రి నడిచిన మార్గానికి... ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఉత్పల్​.

ఇదీ చూడండి:కర్​నాటకం: సుప్రీంలో సభాపతికి చుక్కెదురు

ABOUT THE AUTHOR

...view details