తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవా సీఎం మనోహర్​ పారికర్​ కన్నుమూత - మనోహర్​ పారికర్​

గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్లోమగ్రంధి వ్యాధితో బాధపడుతున్నారు.

గోవా సీఎం పారికర్​ మృతి

By

Published : Mar 17, 2019, 8:14 PM IST

Updated : Mar 17, 2019, 10:17 PM IST

గోవా సీఎం మనోహర్​ పారికర్​ కన్నుమూత
గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి, భాజపా ముఖ్యనేతమనోహర్​ పారికర్ కన్నుమూశారు. కొంతకాలంగాఆయన క్లోమగ్రంథి కేన్సర్​తో బాధపడుతున్నారు. శనివారం ఆరోగ్యంతీవ్రంగా విషమించింది. అప్పటి నుంచి వెంటిలేటర్​పైనే పారికర్​కుచికిత్సనందిస్తున్నారు వైద్యులు. అయినా పారికర్​ కోలుకోలేకపోయారు. నేటిసాయంత్రం 6గంటల 40 నిమిషాలకు కన్నుమూశారు.

క్లోమ గ్రంథి వ్యాధి వల్ల పలుమార్లు విదేశాల్లో చికిత్స పొందారు పారికర్​.ముంబయి, దిల్లీల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లోనూ వైద్యం చేయించుకున్నారు. అయినా వ్యాధి నయమవలేదు. 63ఏళ్ల వయసులో నేడుకన్నుమూశారు.

రాష్ట్రపతి సంతాపం..

పారికర్​ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.జీవితం మొత్తం ఆయనప్రజల కోసమే కష్టపడ్డారని అన్నారు. దేశానికి, గోవా ప్రజలకు పారికర్​ చేసిన సేవలు చిరస్మరణీయమని ట్వీట్​ చేశారు.

Last Updated : Mar 17, 2019, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details