తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్పులు చేర్పులతో దిల్లీ విమానాశ్రయం సంసిద్ధం - GMR airport begins work

విమాన సేవలకు కేంద్రం అనుమతించిన మరుక్షణమే పనులు ప్రారంభమయ్యేలా దిల్లీలోని జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. భౌతిక దూరం, శుభ్రతలకు ప్రాధాన్యమిస్తూ విమానాశ్రయంలో మార్పులు చేర్పులు చేసింది.

GMR begins works on Phase 3A expansion of IGI airport
దిల్లీ విమానాశ్రయం సంసిద్ధం

By

Published : May 4, 2020, 7:12 AM IST

విమాన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అనుమతిచ్చిన మరుక్షణమే పని ప్రారంభించడానికి దిల్లీలోని జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. ముందుగా మూడో టెర్మినల్‌ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లను కొలిక్కి తీసుకువస్తున్నారు. విమానాశ్రయానికి చేరుకున్నప్పటి నుంచి విమానంలో ప్రవేశించేవరకు అన్నిచోట్లా భౌతిక దూరం, శుభ్రతలకు ప్రాధాన్యమిస్తూ మార్పులు చేర్పులు చేసినట్లు విమానాశ్రయ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇకమీదట ప్రయాణికులు బోర్డింగ్‌ పాస్‌లను ఇంటి దగ్గరే ప్రింట్‌ తీసుకొని తమ పేర్లు, విమానయాన వివరాలను ప్రస్ఫుటంగా కనిపించేలా చేసుకొని రావాలన్న నిబంధనను అమలులోకి తీసుకురానున్నారు. ఒక్కో విమానయాన సంస్థకు ఒక్కో ప్రవేశ మార్గాన్ని, ఒక్కో నిష్క్రమణ మార్గాన్ని కేటాయిస్తున్నారు.

యూవీ టన్నెల్‌ ద్వారా లగేజి

  • సామాన్లు తీసుకువెళ్లే ట్రాలీలన్నింటినీ క్రిమిరహితంగా శుభ్రం చేయనున్నారు. 'అతినీలలోహిత కిరణాలు ప్రసరించే సొరంగ మార్గం' (యూవీ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌) ద్వారా లగేజి వచ్చేలా కొత్త విధానం నెలకొల్పారు.
  • వరసల్లో ప్రయాణికులు మీటరు దూరంలో నిల్చొనేలా మార్కింగ్‌ చేశారు.
  • భౌతిక దూరం పాటిస్తూ సీట్లు ఏర్పాటు చేశారు.
  • విమానాశ్రయంలో ఏ యంత్రం వినియోగించాలన్నా అక్కడున్న శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకొనే వీలు కల్పించారు.
  • ఫుడ్‌కోర్టుల్లో, లిఫ్టుల్లో రెండు గజాల దూరం పాటించే ఏర్పాట్లు చేశారు.
  • విమానాశ్రయం వెలుపల టాక్సీల కోసం వేచి చూసేచోట కూడా దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్‌ చేశారు. సందర్శకుల ప్రవేశాన్ని నిలిపేశారు.
  • మొత్తం సిబ్బందిని థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. అంతర్గత యాప్‌ ద్వారా ప్రతివారం స్వీయ డిక్లరేషన్‌ తీసుకుంటారు.
  • చేతి తొడుగులు, మాస్కులు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాల విక్రయశాలలనూ తాత్కాలికంగా దిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details