తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారు వద్దంటే అయోధ్య భూమిని మాకివ్వండి' - అయోధ్య భూమిపై షియా వక్ఫ్ బోర్డు

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఇవ్వాల్సిన 5 ఎకరాల స్థలానికి సంబంధించి షియా వక్ఫ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ స్థలాన్ని స్వీకరించడానికి సున్నీ వక్ఫ్​ బోర్డు నిరాకరిస్తే తమకు కేటాయించాలని కోరింది.

shia waqf board
shia waqf board

By

Published : Nov 28, 2019, 5:00 AM IST

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు ఆదేశాల మేరకు... మసీదు నిర్మాణానికి ఇవ్వాల్సిన 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు కాదంటే తమకివ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు కోరింది. అయితే ఈ స్థలాన్ని మసీదు కోసం కాకుండా ఆసుపత్రి కోసం ఉపయోగిస్తామని తెలిపింది. ఈ విషయంపై కోర్టుకు వెళ్లమని... కేవలం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని బోర్డు పేర్కొంది.

రామజన్మభూమి వివాదంలో ప్రధాన పిటిషన్‌దారుల్లో ఒకరైన సున్నీ వక్ఫ్‌బోర్డు 5 ఎకరాల స్థలంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తీర్పుపై సమీక్ష కోరబోమని మాత్రం సున్నీ వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది.

పునఃసమీక్షకు జమియాత్​

సుప్రీంతీర్పుపై సమీక్ష కోసం జమియాత్​ ఉలేమా-ఈ-హింద్​ కూడా పిటిషన్​ వేసేందుకు సిద్ధమయిందని సమాచారం. డిసెంబర్​ 3 లేదా 4వ తేదీన పిటిషన్​ వేస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ పిటిషన్​ దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వేయటం లేదని.. చట్టం కల్పించిన ప్రత్యేక అధికారాల దృష్ట్యానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు జమియాత్​ చీఫ్ మౌలానా అర్షద్ మాదాని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'అయోధ్య తీర్పుపై డిసెంబర్​ 9లోపు సమీక్ష పిటిషన్'

ABOUT THE AUTHOR

...view details