కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై తమ 'అభిప్రాయాలు, సూచనలు' ఇవ్వాలని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్ననేపథ్యంలోనే జులై 31లోపు తమ అభిప్రాయాలు తెలపాలని అన్ని పార్టీలను కోరింది ఈసీ.
సూపర్ స్పెడ్డర్ ఈవెంట్
ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల్లో ఉపఎన్నికలు ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్లో జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో బిహార్ విపక్ష పార్టీలు ఈసీని ఆశ్రయించాయి. రానున్న ఎన్నికలు సూపర్ స్పెడ్డర్ ఈవెంట్ కాకుండా చూడాలని అభ్యర్థించాయి. అలాగే ఒక పోలింగ్ కేంద్రంలో కేవలం 250 మంది ఓటర్లను మాత్రమే అనుమతించాలని కోరాయి.
ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 34,884 కేసులు, 671 మరణాలు