తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే పియానో వాయించిన చిన్నారి - కణతి ఆపరేషన్​

ఓవైపు చిన్నారి మెదడులోని కణతిని తొలగించే ప్రక్రియలో వైద్యులు నిమగ్నమైతే.. మరోవైపు పియానో వాయిస్తూ, వైద్యులతో ముచ్చటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చిన్నారి. మధ్యప్రదేశ్​ బిర్లా ఆసుపత్రి వైద్యులు ఇలా వినూత్నంగా శస్త్రచికిత్స చేసి బాలికను రక్షించారు. ఆపరేషన్​ సమయంలో చిన్నారి పక్షవాతానికి గురికాకుండా పియానో వాయించమని సూచించినట్లు వైద్యులు తెలిపారు.

girl was playing piano while her brain tumor surgery was going on in gwalior
ఆపరేషన్ చేయించుకుంటూనే పియానో వాయించిన చిన్నారి

By

Published : Dec 13, 2020, 3:08 PM IST

Updated : Dec 13, 2020, 7:50 PM IST

మెదడులో కణతితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి మధ్యప్రదేశ్​ బిర్లా ఆసుపత్రి వైద్యులు వినూత్నంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించారు. ఆపరేషన్​ చేయించుకుంటూనే పియానో వాయిస్తూ చిన్నారి కనిపించింది. 'క్రేనియోటమీ' శస్త్రచికిత్స విధానం ద్వారా చిన్నారికి కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఆపరేషన్​ చేశామని వైద్యులు తెలిపారు.

బాలికకు సర్జరీ 3 రోజుల క్రితం చేయగా.. ఆమె శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. అనంతరం.. ఈ విషయాన్ని డాక్టర్లు పంచుకున్నారు.

ఆపరేషన్ చేయించుకుంటూనే పియానో వాయించిన చిన్నారి

అందుకే పియానో..

మధ్యప్రదేశ్​ మురైనా జిల్లా బాన్​మోర్​ నగరానికి చెందిన తొమ్మిదేళ్ల సౌమ్య.. మెదడుకు సంబంధించిన వ్యాధితో బిర్లా ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షల్లో చిన్నారి మెదడులో కణతి ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. ట్యూమర్ మెదడులోని సున్నితమైన ప్రదేశంలో ఉంది. ఆపరేషన్ సమయంలో చిన్నారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. దీంతో శస్త్రచికిత్స సమయంలో బాలిక మూర్చపోకుండా పియానో వాయించమని సూచించినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారితో మాట్లాడుతూ ఆపరేషన్​ చేశామన్నారు. ప్రస్తుతం చిన్నారి సౌమ్య ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యిందని, బాలిక పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్​ను ఓ అద్భుత విజయంగా అభివర్ణించారు.

ఇదీ చదవండి :రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?

Last Updated : Dec 13, 2020, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details